AP Railway Zone: విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం: పియూష్ గోయల్

Union Minister Piyush Goyal answers about AP Raliway Zone
  • రైల్వే జోన్ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన జీవీఎల్
  • సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్
  • రైల్వే జోన్ ప్రారంభానికి కాలపరిమితి లేదని వెల్లడి
  • డీపీఆర్ పరిశీలనలో ఉదని వివరణ
ఏపీకి రైల్వే జోన్ అంశంలో కేంద్రం తన వైఖరిని తెలిపింది. ఇటీవల బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ పై ప్రకటన వెలువడుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. తాజాగా రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. రైల్వే జోన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని అన్నారు. రైల్వే జోన్ ప్రారంభానికి నిర్దిష్ట కాలపరిమితి లేదు అని వెల్లడించారు. రైల్వే జోన్ డీపీఆర్ ఇంకా పరిశీలనలోనే ఉందని, రైల్వే జోన్ ప్లానింగ్ కు ఓఎస్డీని నియమించామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ను ఆంధ్రా డివిజన్ లో చేర్చే ఉద్దేశం కేంద్రానికి లేదని పియూష్ గోయల్ స్పష్టం చేశారు.
AP Railway Zone
Visakha
GVL Narasimha Rao
Piyush Goyal
Andhra Pradesh

More Telugu News