Phone Pe: ఒక్కొక్క ఉద్యోగికి రూ.3 లక్షల విలువైన షేర్లు బదలాయించిన ఫోన్ పే

Phone Pe transfers shares to its employs

  • ఫోన్ పే కీలక నిర్ణయం
  • 2,200 మంది ఉద్యోగులకు షేర్లు పంచిన వైనం
  • రూ.1,500 కోట్ల విలువైన షేర్ల బదలాయింపు
  • సంతోషం వ్యక్తం చేసిన ఫోన్ పే వ్యవస్థాపకులు

మొబైల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే తన ఉద్యోగుల్లో సంతోషం నింపే చర్యలు తీసుకుంది. ఒక్కొక్కరికి రూ.3 లక్షల విలువైన షేర్లను బదలాయించింది. కంపెనీలోని అన్ని స్థాయుల్లో ఉన్న 2,200 మంది ఉద్యోగులకు వర్తించేలా ఈ నిర్ణయం తీసుకుంది. అందుకోసం రూ.1,500 కోట్లను విలువైన షేర్లను ఉద్యోగుల పరం చేసింది.

 గతేడాది డిసెంబరులో ఫ్లిప్ కార్ట్ నుంచి విడిపోయి స్వతంత్ర సంస్థగా అవతరించాక, ఫోన్ పే తీసుకున్న భారీ నిర్ణయం ఇది. తాజా షేర్ల బదలాయింపుతో ఉద్యోగులను కూడా యాజమాన్యంలో భాగస్వాములను చేసినట్టయింది. ఈ మేరకు ఫోన్ పే వర్గాలు ప్రకటన చేశాయి. ఉద్యోగులు భవిష్యత్తులో లాభసాటి అనిపించినప్పుడు ఈ షేర్లను అమ్ముకోవచ్చు.

ఫోన్ పే సహవ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ ట్విట్టర్ లో స్పందించారు. 'ఫోన్ పే వ్యవస్థాపకులుగా రాహుల్ చారి, నేను అద్భుతమైన భావోద్వేగాలకు గురవుతున్నాం, సంపదను పంచుకోవడం మమ్మల్ని సంతోషంలో ముంచెత్తుతోంది అని వెల్లడించారు.

  • Loading...

More Telugu News