Joe Root: ఎట్టకేలకు 'రూట్' క్లియర్... నదీమ్ బౌలింగ్ లో అవుటైన ఇంగ్లండ్ సారథి

Nadeem gets Root wicket
  • చెన్నై టెస్టులో రూట్ డబుల్ సెంచరీ
  • రూట్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న నదీమ్
  • 500 మార్కు దాటిన ఇంగ్లండ్ స్కోరు
  • ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఇషాంత్
  • 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
చెన్నై టెస్టులో విశ్వరూపం ప్రదర్శించిన ఇంగ్లండ్ సారథి జో రూట్ (218) చిట్టచివరికి స్పిన్నర్ షాబాజ్ నదీమ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. భారత బౌలర్లను విసిగిస్తూ, అడ్డుగోడలా నిలిచిన రూట్ ను లెఫ్టార్మ్ స్పిన్నర్ నదీమ్ ఓ చక్కని బంతితో పెవిలియన్ చేర్చాడు. తిరుగులేని ఫామ్ లో ఉన్న రూట్ ను తొలగించి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే, అప్పటికే ఇంగ్లండ్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. రూట్ అవుటయ్యే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 6 వికెట్లకు 477 పరుగులు.

ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (30) కూడా ధాటిగా ఆడడంతో ఇంగ్లండ్ స్కోరు 500 మార్కు దాటింది. ప్రస్తతం ఇంగ్లండ్ స్కోరు 8 వికెట్లకు 525 పరుగులు. అంతకుముందు బెన్ స్టోక్స్ 82, ఓల్లీ పోప్ 34 పరుగులు చేశారు. కాగా, ఇషాంత్ శర్మ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. బట్లర్, ఆర్చర్ లను పెవిలియన్ చేర్చాడు.
Joe Root
Shabaz Nadeem
England
India
Chennai Test

More Telugu News