Telegram App: అత్యధిక డౌన్ లోడ్లతో దూసుకుపోతున్న టెలిగ్రాం యాప్

Telegram going high with most downloads in Google Playstore
  • వాట్సాప్ కు తగ్గుతున్న ఆదరణ
  • నూతనంగా తెచ్చిన ప్రైవసీ పాలసీపై యూజర్ల విముఖత!
  • ప్రత్యామ్నాయ యాప్ లపై నెటిజన్ల దృష్టి
  • ఆకర్షిస్తున్న టెలిగ్రాం యాప్
నిన్నమొన్నటి దాకా వాట్సాప్ స్థానం చెక్కుచెదరని రీతిలో నిలిచింది. అయితే యూజర్లపై ప్రైవసీ పాలసీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందంటూ వాట్సాప్ పై విమర్శలు వచ్చాయి. అదే సమయంలో టెలిగ్రాం యాప్ వైపు ప్రజల దృష్టి మళ్లింది. ఇది కూడా వాట్సాప్ కు దీటుగా ఉండడంతో అత్యధికులు దీన్ని ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్ లో టెలిగ్రాం యాప్ అత్యధిక డౌన్ లోడ్లు నమోదు చేస్తోంది. కొన్నినెలల కిందట డౌన్ లోడ్ల పరంగా ప్లేస్టోర్ లో 9వ స్థానంలో ఉన్న టెలిగ్రాం యాప్ ఇప్పుడు నెంబర్ వన్ అయింది.

ప్రైవసీ పాలసీని కచ్చితంగా అంగీకరించాల్సిందే అనేలా వాట్సాప్ నిబంధనలు తీసుకురావడంతో ఎందుకొచ్చిన బాధ అనుకుంటూ నెటిజన్లు ప్రత్యామ్నాయ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారికి టెలిగ్రాం యాప్ ఉపయుక్తంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో టెలిగ్రాం డౌన్ లోడ్ల సంఖ్య 63 మిలియన్లు కాగా, గతేడాది జనవరిలో డౌన్ లోడ్ల సంఖ్యకు అది 3.8 రెట్లు అధికం. భారత్ లోనే అత్యధికంగా 24 శాతం డౌన్ లోడ్లు నమోదయ్యాయట. ఆ తర్వాత ఇండోనేషియాలో 10 శాతం డౌన్ లోడ్లు వచ్చాయి. ఈ మేరకు సెన్సార్ టవర్ అనే సంస్థ వెల్లడించింది.
Telegram App
Downloads
Google Palystore
Whatsapp
Privacy Policy

More Telugu News