Peddireddi Ramachandra Reddy: పెద్దిరెడ్డి పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పు.. ఎస్ఈసీ ఉత్తర్వుల రద్దు!

high court gives verdict on peddy reddy petition

  • పెద్దిరెడ్డిని ఇంటికే ప‌రిమితం చేయాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు
  • మీడియాతో మాత్రం మాట్లాడకూడ‌ద‌ని ఆదేశాలు‌
  • రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి వెళ్లిన మంత్రి 

పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే ప‌రిమితం చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఎస్ఈసీ ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే, ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిష‌న్‌ దాఖలు చేయ‌డంతో దానిపై న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది.

మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే ప‌రిమిత‌మై ఉండాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపింది. అయితే, ఆయ‌న మీడియాతో మాట్లాడ‌వ‌ద్ద‌న్న ఎస్ఈసీ ఆదేశాల‌ను మాత్రం స‌మ‌ర్థించింది. ఎన్నికల అంశాలకు సంబంధించి ఏ విషయాలనూ మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది.

కాగా, ఎస్ఈసీ ఈ నెల 6న ఇచ్చిన ఉత్త‌ర్వులు ఏకపక్షంగా ఉన్నాయని పెద్దిరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్న విష‌యం తెలిసిందే. నోటీసు ఇవ్వకుండా, వివరాలు తీసుకోకుండా ఇచ్చిన‌ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని ఆయ‌న‌ తెలిపారు. రాష్ట్రపతి తిరుమలకు వస్తోన్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డానికి పెద్దిరెడ్డి ఇప్ప‌టికే అక్క‌డ‌కు వెళ్లారు.

  • Loading...

More Telugu News