ITBP: ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలు... సొరంగంలో చిక్కుకున్న 16 మందిని కాపాడిన భద్రతా బలగాలు

ITBP rescues sixteen people in a tunnel

  • చమోలీ ప్రాంతంలో విరిగిపడిన కొండ చరియలు
  • ధౌలిగంగా నదిలో హఠాత్తుగా పెరిగిన నీటిమట్టం
  • దిగువన ఉన్న ప్రాంతాలు జలమయం
  • తపోవన్ విద్యుత్ ప్రాజెక్టు నీట మునక

ఉత్తరాఖండ్ లోని చమోలీ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడి ధౌలిగంగా నదికి వరదలు సంభవించడం తెలిసిందే. ఈ వరదల కారణంగా రిషిగంగా ప్రాంతంలోని తపోవన్ విద్యుత్ ప్రాజెక్టు నీట మునిగింది. సహాయక చర్యలు చేపట్టిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది ఓ సొరంగం నుంచి 16 మందిని కాపాడారు. ఆకస్మిక వరదలు వచ్చిన సమయంలో ఈ కార్మికులు సొరంగంలో పనులు చేస్తున్నారు. ఒక్కసారిగా బురదతో కూడిన వరద రావడంతో వారు బయటికి వచ్చే మార్గంలేక అందులోనే చిక్కుకుపోయారు.

అయితే, ఐటీబీపీ సిబ్బంది ఎంతో శ్రమించి వారిని బయటికి తీశారు. కాగా, ఈ వరదల్లో 150 మంది వరకు గల్లంతైనట్టు భావిస్తున్నారు. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలు వెలికితీసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అటు, మృతుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ సర్కారు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించనుంది.

  • Loading...

More Telugu News