test: చెన్నై టెస్టులో ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియా
- 305 పరుగుల వద్ద అశ్విన్ (31) ఔట్
- క్రీజులో వాషింగ్టన్ సుందర్ (64), నదీమ్ (0)
- తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగులు
- ఇంకా 266 పరుగులు వెనకబడి ఉన్న భారత్
భారత్-ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్సింగ్స్ నాలుగోరోజు ఆటలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 305 పరుగుల వద్ద అశ్విన్ 31 పరుగులకు ఔటయ్యాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 6, శుభ్‌మన్ గిల్ 29, పుజారా 73, విరాట్ కోహ్లీ 11, అజింక్యా రహానె 1, రిషభ్ పంత్ 91 పరుగులు చేసి ఔటయ్యారు.
ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ 64, నదీమ్ 0 పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో డామ్ బెస్ 4, ఆర్చర్ 2, లీచ్ 1 వికెట్లు తీశారు. నిన్న ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లకు 257 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగులు చేసింది. టీమిండియా స్కోరు 90 ఓవర్లకు 312/7 గా ఉంది. తొలి ఇన్నింగ్సులో టీమిండియా ఇంకా 266 పరుగులు వెనకబడి ఉంది.