Sensex: భారీ లాభాల్లో నుంచి.. చివరి గంటలో స్వల్ప నష్టాలలోకి జారుకున్న మార్కెట్లు
- ఒకానొక సమయంలో 487 పాయింట్ల లాభంలో ఉన్న సెన్సెక్స్
- చివరకు 19 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
- 6 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ట్రేడింగ్ ముగియడానికి ఒక గంట ముందు సెన్సెక్స్ దాదాపు 487 పాయింట్ల లాభంతో ఉంది. కానీ, చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
ముఖ్యంగా మెటల్, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా స్టాకులు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయి 51,329కి పడిపోయింది. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 15,109 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.84%), ఓఎన్జీసీ (2.61%), టైటాన్ కంపెనీ (1.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.37%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.22%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-3.29%), బజాజ్ ఫైనాన్స్ (-1.66%), బజాజ్ ఆటో (-1.30%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.75%), ఐటీసీ (-0.66%).