Pawan Kalyan: ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ
- నిన్న ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్
- పార్లమెంటు ఆవరణలో అమిత్ షాతో సమావేశం
- పవన్ వెంట నాదెండ్ల మనోహర్
- విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై విజ్ఞప్తి!
- తిరుపతి లోక్ సభ అభ్యర్థిపైనా చర్చించే అవకాశం
ఏపీ తాజా పరిస్థితులను కేంద్రం పెద్దలకు వివరించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయడానికి పవన్ ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, పవన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పార్లమెంటు ఆవరణలో భేటీ అయ్యారు. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపైనా వారు అమిత్ షాతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. తిరుపతిలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించారు. మరి ఆ అభ్యర్థి ఎవరన్నది బీజేపీ పెద్దలతో సమావేశాల అనంతరం తేలనుంది. పవన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసే అవకాశాలున్నాయి.