Kangana Ranaut: ఆ హాలీవుడ్ తారల కన్నా గొప్ప నటినంటున్న హీరోయిన్ క‌ంగ‌న

kangana slams netizens
  • నా స్థాయి నటి ప్రస్తుతం ఈ భూమి మీద లేదు
  • మెరిల్ స్ట్రీప్‌లో ఉండే ప్రతిభ నాలో ఉంది
  • గాల్ గాడోట్‌లా నేనూ యాక్షన్‌ చేయగలను
హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, యాక్షన్ స్టార్ టామ్ క్రూస్ కంటే తాను గొప్పగా స్టంట్లు చేయగలనని బాలీవుడ్ హీరోయిన్ కంగ‌న ర‌నౌత్ చెప్పింది. తన కొత్త సినిమాలు తలైవి, థాకడ్ లో నటిస్తోన్న సంద‌ర్భంగా తీసుకున్న శిక్ష‌ణ‌, ఆ సినిమా లుక్‌ల‌ను పోస్ట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్య‌లు చేసింది.

త‌న స్థాయిలో నటించగలిగే మరో నటి ప్రస్తుతం ఈ భూమి మీద లేదని చెప్పింది. వైవిధ్యమైన పాత్రలు అద్భుతంగా పోషించే హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్‌లో ఉండే ప్రతిభ త‌నలో ఉందని చెప్పుకొచ్చింది. అంతేగాక‌, ఇజ్రాయిల్‌ ప్రముఖ నటి గాల్ గాడోట్‌లా తాను యాక్షన్‌ చేయగలనని చెప్పింది. మ‌రోవైపు, గ్లామరస్‌గానూ కనిపించగలనని ట్వీట్లు చేసింది. దీంతో ఆమెపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తుండ‌డంతో మ‌రో ట్వీట్ చేసింది.  

ఎన్ని ఆస్కార్‌లు సాధించావంటూ త‌న‌ను కొంద‌రు అడుగుతున్నార‌ని, వారికి తాను ఒకటే చెప్ప‌గ‌ల‌న‌ని పేర్కొంది. మెరిల్ స్ట్రీప్ ఎన్ని జాతీయ అవార్డులు సాధించిందని ఆమె ప్ర‌శ్నించింది. అలాగే, ఎన్ని పద్మ అవార్డులు సాధించిందని అడిగింది. ఈ ప్రశ్నల‌కు సమాధానం ఉండదని, విమ‌ర్శ‌లు చేస్తోన్న వారు బానిస మనస్తత్వం నుంచి బయటపడాల‌ని ఆమె మండిప‌డింది. ఆత్మ గౌరవంతో మెల‌గాల‌ని చెప్పుకొచ్చింది.
Kangana Ranaut
Tollywood
Bollywood

More Telugu News