Sunny Leone: సన్నీ లియోన్ ను అరెస్ట్ చేయొద్దు: కేరళ హైకోర్టు

Sunny Leone gets relief in Keral High Court

  • సన్నీపై కేసు పెట్టిన ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ
  • రూ. 29 లక్షలు తీసుకుని ఈవెంట్ కు హాజరు కాలేదని ఫిర్యాదు
  • హైకోర్టును ఆశ్రయించిన సన్నీ లియోన్

బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ కు కేరళ హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే, సన్నీ తమను మోసం చేసిందంటూ ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఆమెపై ఫిర్యాదు చేసింది. 2019లో కొచ్చిలో జరిగిన వేలంటైన్స్ డే ఫంక్షన్ లో పాల్గొంటానని సన్నీ తమ నుంచి రూ. 29 లక్షలు తీసుకుందని... కానీ, ఈవెంట్ కు ఆమె హాజరు కాలేదంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా సన్నీ లియోన్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు.

ఇటీవల ఓ టీవీ షో  కోసం తిరువనంతపురం వచ్చిన సన్నీని పోలీసులు ప్రశ్నించారు. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఈ సందర్భంగా సన్నీ తెలిపింది. అంతేకాదు, కేరళ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... సన్నీని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఆమెకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించింది.

  • Loading...

More Telugu News