Rashi Khanna: గోపీచంద్ కథానాయికగా మళ్లీ రాశీఖన్నా!

Rashi Khanna opposite Gopichand again
  • మారుతి దర్శకత్వంలో గోపీచంద్ ప్రాజక్ట్ 
  • టైటిల్ గా 'పక్కా కమర్షియల్' నిర్ణయం
  • గోపీచంద్ తో రాశికి మూడో సినిమా  
ఒక్కోసారి అంతే.. కొన్ని కాంబినేషన్లు వెంటనే రిపీట్ అవుతుంటాయి. ఇప్పుడు దర్శకుడు మారుతి, కథానాయిక రాశీఖన్నా కాంబినేషన్ కూడా అలాగే మళ్లీ వస్తోంది. గత సంవత్సరం వీరి కాంబినేషన్లో 'ప్రతిరోజూ పండగే' వంటి విజయవంతమైన సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ తన తాజా చిత్రంలో రాశీఖన్నాకు దర్శకుడు మారుతి అవకాశాన్ని ఇస్తున్నారు.

యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రానున్న సంగతి మనకు తెలిసిందే. యూవీ క్రియేషన్స్, జీఏ 2 సంస్థలు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి 'పక్కా కమర్షియల్' అనే వెరైటీ టైటిల్ని కూడా ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో కథానాయికగా రాశీఖన్నాను తాజాగా ఎంపిక చేసినట్టు సమాచారం.

విశేషం ఏమిటంటే, గోపీచంద్, రాశీఖన్నా కాంబినేషన్ కు ఇది మూడో చిత్రం. గతంలో వీరిద్దరూ కలసి 'జిల్', 'ఆక్సిజన్' చిత్రాలలో నటించారు. ఇప్పుడు ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Rashi Khanna
Gopichand
Maruthi

More Telugu News