China: దేశంలో ప్రతి ఏటా 30.7 శాతం మంది ఎలా మరణిస్తున్నారో తెలుసా?

27 lakh people in India going to die every year due to air pollution

  • దేశంలో ఏటా 27 లక్షల మంది వాయు కాలుష్యానికి బలి
  • ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది మృత్యు ఒడిలోకి
  • చైనా, భారత్‌లోనే అత్యధిక మరణాలు

భారతదేశంలో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ లండన్ యూనివర్సిటీ సహా మరికొన్ని సంస్థలు నిర్వహించిన అధ్యయంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. దేశంలో ప్రతి ఏటా సంభవిస్తున్న మరణాల్లో 30.7 శాతం అంటే దాదాపు 27 లక్షల మంది శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న విషతుల్యమైన గాలిని పీల్చడం ద్వారా చనిపోతున్నట్టు అధ్యయనం తేల్చింది. బొగ్గు, పెట్రోలు, డీజిల్ వంటి శిలా ఇంధనాల వినియోగం వల్ల వెలువడుతున్న కాలుష్యం కారణంగా  2018లో ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది చనిపోయినట్టు అధ్యయన నివేదిక పేర్కొంది.

 ప్రతీ ఐదు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగా సంభవిస్తున్నట్టు తెలిపింది. నిజానికి ఊహించిన దానికంటే దాని తీవ్రత అధికంగా ఉన్నట్టు వివరించింది. పంట వ్యర్థాల దహనం, దుమ్ము, పొగ, కార్చిచ్చు వల్ల గాల్లో కలిసిపోయే సూక్ష్మరేణువుల వల్ల 42 లక్షల మంది చనిపోతున్నట్టు అధ్యయనకారులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే శిలాజ ఇంధనాల కాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాల జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో ఏటా 39.1 లక్షల మంది మరణిస్తుండగా, మన దేశంలో 24.6 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2018లో అత్యధికంగా 4,71,546 మంది వాయుకాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాతి స్థానంలో బీహార్ ఉంది. అక్కడ 2,88,821 మంది మరణించారు. ఈ అధ్యయన వివరాలు ‘ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

  • Loading...

More Telugu News