YS Sharmila: ఖమ్మం నేతలతో షర్మిల భేటీ
- 21న ఖమ్మంలో వైఎస్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం
- పోడు భూముల సమస్యలే ఎజెండాగా సదస్సు
- లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్ తో వెళ్లనున్న షర్మిల
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల.. నేడు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన తర్వాత.. ఆమె ఆ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఖమ్మం నేతలతో చర్చించారు.
ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఆమె నిర్ణయించారు. ఆ రోజు లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్ తో ఖమ్మంకు ఆమె బయల్దేరనున్నారు. పోడు భూముల సమస్యలే ఎజెండాగా ఆ సమ్మేళనం నిర్వహించనున్నట్టు పలువురు నేతలు చెబుతున్నారు. సమ్మేళనానికి ముందు వైఎస్ అభిమానులు, గిరిజనులతో షర్మిల సమావేశమవుతారని సమాచారం.
కాగా, మంగళవారం ఆమె వైఎస్ అభిమానులతో లోటస్ పాండ్ లో సమావేశమైన సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని, పార్టీ గురించి త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. దీంతో కొందరు నేతలు ఆమె పార్టీపై విమర్శలు గుప్పించారు.