Amit Shah: ఎన్నికలు అయ్యేలోగా మమతా బెనర్జీ 'జైశ్రీరాం' అంటారు: అమిత్ షా
- కూచ్ బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా
- బీజేపీ అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరని వ్యాఖ్య
- జైశ్రీరాం నినాదాలు ఇండియాలో కాకపోతే పాకిస్థాన్ లో చేస్తారా? అని మండిపాటు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి విమర్శలు గుప్పించారు. ఉత్తర బెంగాల్ లోని కూచ్ బీహార్ లో అమిత్ షా ఈరోజు ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని మోదీ అభివృద్ధి మోడల్ కు, మమతా బెనర్జీ విధ్యంసకర మోడల్ కు మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు.
గత నెలలో కోల్ కతాలో మోదీ పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ కూడా కూడా హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు ఆమె ప్రసంగిస్తుండగా జైశ్రీరాం నినాదాలు కొందరు చేయగా... ఆమె అసహనాన్ని వ్యక్తం చేస్తూ ప్రసంగాన్ని ఆపేశారు. దీనిపై అమిత్ షా మాట్లాడుతూ, జైశ్రీరాం నినాదాలు ఇండియాలో కాకపోతే... పాకిస్థాన్ లో చేస్తారా? అని ఎద్దేవా చేశారు. జైశ్రీరాం అనే నినాదాలు చేస్తే మమత ఆగ్రహం వ్యక్తం చేశారని... ఈ ఎన్నికలు ముగిసేలోగా ఆమె తనకు తానుగా శ్రీరాముడి నినాదాలు చేస్తారని చెప్పారు. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రాకుండా టీఎంసీ గూండాలతో పాటు, మరెవరూ ఆపలేరని అన్నారు.