SC: ఎస్సీ, ఎస్టీల విషయంలో ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనేదీ లేదు: కేంద్రం
- క్రైస్తవం, ఇస్లాంలోకి మారే ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్లు కోల్పోతారు
- రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తిరస్కరించవచ్చు
- జీవీఎల్ ప్రశ్నకు రవిశంకర్ ప్రసాద్ సమాధానం
క్రైస్తవం, ఇస్లాంలోకి మారే ఎస్సీ, ఎస్టీలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కోల్పోతారని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల జాబితాలోని అనేకమంది మతం మార్చుకున్నప్పటికీ రిజర్వుడ్ స్థానాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి పదవులు అనుభవిస్తున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ చేసే ఆలోచన ఏమైనా కేంద్రానికి ఉందా? అని ప్రశ్నించారు.
జీవీఎల్ ప్రశ్నకు కేంద్ర న్యాయ, చట్టశాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని సభకు తెలిపారు. అయితే, వారు మతం మారినట్టు ఎన్నికల నామినేషన్ల సమయంలో రిటర్నిగ్ అధికారులకు సాక్ష్యాలతో సహా ధ్రువీకరిస్తే వారి నామినేషన్లు తిరస్కరించవచ్చని అన్నారు.