India: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయిన భారత్
- జట్టులోకి కొత్తగా అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్
- విజయం ఇచ్చిన ఊపులో రూట్ సేన
- గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చేపాక్ స్టేడియంలో ప్రారంభమైన రెండో టెస్టులో కోహ్లీ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో టాస్ కీలక పాత్ర పోషించడంతో ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కే మొగ్గుచూపాడు.
ఇక, భారత జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. మూడు బంతులు ఆడిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఓలీ స్టోన్ వేసిన బంతిని అర్థం చేసుకోవడంలో పొరబడిన గిల్ వికెట్ సమర్పించుకున్నాడు.
కాగా, ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు, విజయం ఇచ్చిన ఊపుతో ఉన్న ఇంగ్లిష్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని యోచిస్తోంది. ఇరు జట్లకు ఇది ఎంతో కీలకమైన మ్యాచ్ కావడంతో హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. కాగా, భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి కొత్తగా అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వచ్చి చేరారు.