India: 329కి ముగిసిన భారత ఇన్నింగ్స్... పంత్ కు అండగా నిలవని టెయిలెండర్లు!

Indian Innings Closed for 329

  • ఇషాంత్, కుల్ దీప్ డక్కౌట్
  • నాలుగు వికెట్లు తీసిన మోయిన్ అలీ
  • ఓలీ స్టోన్ కు లభించిన మూడు వికెట్లు

చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కు టెయిలెండర్లు ఎవరూ అండగా నిలువలేకపోవడంతో, నిన్నటి స్కోరుతో పోలిస్తే, మరో 29 పరుగులు జోడించే లోగానే భారత జట్టు తన చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది.

నిన్న తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించి 161 పరుగులు చేయగా, శుభమన్ గిల్ 0, ఛటేశ్వర్ పుజారా 21, విరాట్ కోహ్లీ 0, అజింక్యా రహానే 67, రవిచంద్రన్ అశ్విన్ 13, అక్సర్ పటేల్ 5, ఇషాంత్ శర్మ 0, కుల్ దీప్ యాదవ్ 0, మహమ్మద్ సిరాజ్ 4 పరుగులు చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ 58 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు.

ఇక ఇదే సమయంలో ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీకి 4, ఓలీ స్టోన్ కు 3 వికెట్లు లభించగా, జాక్ లీచ్ కు 2, జోయ్ రూట్ కు 1 వికెట్ లభించాయి. మరికాసేపట్లో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. పిచ్ బౌలింగ్ కు, ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలిస్తూ ఉండటంతో భారత బౌలర్లు రాణించవచ్చని క్రీడా పండితులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News