Kotak Mahindra Bank: కోటక్ బ్యాంక్ నుంచి రెమిట్ సేవలు.. ఇక మొబైల్ నుంచే విదేశాలకు నగదు బదిలీ!

Kotak Mahindra Bank announces launch of Kotak Remit on mobile
  • ఫారెక్స్ రెమిటెన్స్ సేవలు ప్రారంభించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ 
  • రోజుకు గరిష్ఠంగా 25 వేల డాలర్లు పంపుకునే అవకాశం
  • ధ్రువీకరణ అవసరం లేకుండానే పంపుకునే సౌలభ్యం
విదేశాల్లో ఉన్న మనవారికి డబ్బులు పంపేందుకు ఇప్పటి వరకు పడుతున్న కష్టాలకు ఇక ఫుల్‌స్టాప్ పడినట్టే. ఇకపై మొబైల్ నుంచే నగదు బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం కోటక్ బ్యాంకు కొత్తగా ఫారెక్స్ రెమిటెన్స్ సేవలను ప్రారంభించింది. కోటక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ సాయంతో ఈ సేవలను ఖాతాదారులు ఉపయోగించుకోవచ్చు.

అనుమతి ఉన్న దేశాలకు రోజుకు 25 వేల డాలర్ల వరకు ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా పంపించుకోవచ్చు. అలాగే, ఏడాదిలో గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్లు పంపుకోవచ్చు. కోటక్ రెమిట్ ద్వారా అమెరికన్, ఆస్ట్రేలియన్ డాలర్లు, యూకే పౌండ్ స్టెర్లింగ్, హాంకాంగ్ డాలర్, సౌదీ రియాల్, కెనడా డాలర్, సింగపూర్ డాలర్, యూరో, జపాన్ యెన్ వంటి 15 దేశాల కరెన్సీలను పంపుకునే వీలుంది.
Kotak Mahindra Bank
Forex Remittance
Mobile App

More Telugu News