PMO: కర్నూలు జిల్లా ప్రమాద మృతులకు పీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఇస్తున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి
- కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- 14 మంది మృత్యువాత
- స్పందించిన పీఎంవో
- తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు
- ఇప్పటికే ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
ఇటీవల కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టెంపో, లారీ ఢీకొని 14 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. అయితే, మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్టు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు.
అంతేకాకుండా, తీవ్రగాయాల పాలైన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తారని తెలిపారు. అటు, ఏపీ సీఎం జగన్ ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.1 లక్ష సాయం అందించాలని నిర్ణయించారు.