Sputhnik v: ఇండియాకు మూడో టీకా 'స్పుత్నిక్ వి'... అతి త్వరలో అనుమతి!
- ట్రయల్స్ నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్
- తుది దశకు చేరుకున్న ట్రయల్స్
- 91.6 శాతం ప్రభావవంతం
రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వి'కి ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతుండగా, ఇవి తుది దశకు చేరుకున్నాయని, అతి త్వరలోనే అత్యవసర వినియోగానికి అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ లోగా ఈ టీకా మన దేశంలో అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ టీకా 91.6 శాతం మేరకు ప్రభావవంతంగా ఉందని లాన్సెట్ జర్నల్ గతంలోనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 'స్పుత్నిక్ వి' అందుబాటులోకి వస్తే ఇండియాకు లభించే మూడవ టీకా అవుతుంది.