Arvind: టీఆర్ఎస్‌ను బొంద పెట్టే వరకు నిద్రపోము: ఎంపీ అర్వింద్
- రాష్ట్రంలో దొంగ పాస్ పోర్టుల వ్యవహారం
- హిందువులు ఆందోళనలకు గురవుతున్నారు
- తెలంగాణ కాంగ్రెస్‌లో కేసీఆర్ చెప్పినవాళ్లకే పీసీసీ అధ్యక్ష పదవి
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే వరకు తాము నిద్రపోమని బీజేపీ ఎంపీ అర్వింద్ చెప్పారు. రాష్ట్రంలో దొంగ పాస్ పోర్టుల వ్యవహారం హిందువులను ఆందోళనలకు గురి చేస్తోందని ఆయన చెప్పారు. రోహింగ్యాల పాస్ పోర్టు జారీకి నైతిక బాధ్యత వహిస్తూ పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని ఆయన అన్నారు.
ముస్లింల ఓట్ల శాతాన్ని పెంచేందుకే నిజామాబాద్ సీపీ కార్తికేయకు పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఆయనకు మరో చోటకు పదోన్నతి వచ్చినప్పటికీ కార్తికేయ నిజామాబాద్ జిల్లాను వదలడం లేదని చెప్పారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్‌లో కేసీఆర్ చెప్పినవాళ్లకే పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆ రెండు పార్టీలకు మధ్య సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్యను ఖండిస్తున్నామని తెలిపారు.