Sansha City: సన్షా సిటీ... దక్షిణ చైనా సముద్రంలో చైనా అతి భారీ నగరం!

Sansha City world largest city

  • దక్షిణ చైనా సముద్రంపై పట్టు పెంచుకునేందుకు చైనా ప్రయత్నం
  • 2012లో సన్షా సిటీ ప్రకటన
  • ఇప్పటికి 8 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణానికి పెరిగిన నగరం
  • న్యూయార్క్ సిటీ కంటే 1,700 రెట్లు పెద్ద నగరం

ప్రపంచంలో పెద్ద నగరాలంటే న్యూయార్క్, లండన్, టోక్యో అని చెప్పడం పరిపాటి. కానీ  దక్షిణ చైనా సముద్రంలో 2012లో చైనా ప్రకటించిన సన్షా సిటీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత భారీ నగరం అయింది. దీని విస్తీర్ణం 8 లక్షల చదరపు మైళ్లు. న్యూయార్క్ నగరం కంటే సన్షా సిటీ 1,700 రెట్లు పెద్దది. అయితే మహానగరంలో అత్యధిక భాగం ఉప్పునీటి జలాలే. దక్షిణ చైనా సముద్రంలో చైనా తనవిగా చెప్పుకుంటున్న పారాసెల్ దీవులు, స్ప్రాట్లీ దీవులు కూడా ఈ నగర పరిధిలోకే వస్తాయి.

దక్షిణ చైనా సముద్రంలోని అనేక దీవుల సమాహారంగా సన్షా సిటీ గురించి చెప్పుకోవచ్చు. అయితే పారాసెల్ దీవులు తమకే చెందుతాయని అటు వియత్నాం, తైవాన్ చెబుతుండగా, స్ప్రాట్లీ దీవుల భూభాగంపై తమకే హక్కులు ఉన్నాయని వియత్నాం, తైవాన్ లతో పాటు ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై వంటి దేశాలు వాదిస్తున్నాయి.

చైనా ఇవేవీ పట్టించుకోకుండా దక్షిణ చైనా సముద్రంపై తన పట్టును మరింత పెంచుకునేందుకు సన్షా సిటీని విస్తరించుకుంటూ పోతోంది. వివాదాస్పద దీవులన్నింటినీ ఈ నగరం పరిధిలో కలిపేస్తోంది. ఈ క్రమంలోనే సన్షా సిటీ తిరుగులేని భారీ నగరంగా అవతరించింది. ఈ మేరకు అమెరికా నావల్ కాలేజ్ తన నివేదికలో వెల్లడించింది.

  • Loading...

More Telugu News