Fonts: వేటూరి, సిరివెన్నెల పేరిట తెలుగు ఫాంట్స్ ఆవిష్కరణ
- యూనికోడ్ ఫాంట్లు రూపొందించిన అప్పాజీ అంబరీష
- ఆ ఫాంట్లకు దిగ్గజ సినీ గేయ రచయితల పేర్లు
- ఫాంట్లను ఆవిష్కరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి
- అప్పాజీ అంబరీషను అభినందించిన సిరివెన్నెల
టాలీవుడ్ నటుడు అప్పాజీ అంబరీష దర్భ గతంలో అనేక తెలుగు ఫాంట్స్ రూపొందించారు. తాజాగా మరో రెండు రకాల యూనికోడ్ ఫాంట్స్ కు రూపకల్పన చేశారు. సుప్రసిద్ధ సినీ గీత రచయితలైన 'వేటూరి', 'సిరివెన్నెల' పేర్లను ఆ రెండు ఫాంట్లకు పెట్టారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈ రెండు ఫాంట్స్ ను సిరివెన్నెల సీతారామశాస్త్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ గురుసమానులైన వేటూరి పేరుతో రూపొందించిన ఫాంట్స్ ను ఆవిష్కరించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానని అన్నారు. అంబరీష ఎంతో ఆసక్తితో భాష పట్ల కృషి చేస్తున్నారని, ఫాంట్స్ ను తయారుచేసి తెలుగు భాష ప్రాముఖ్యతను మరింత పెంచుతున్నారని కొనియాడారు.