Andhra Pradesh: ఏపీలో ముగిసిన నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

Fourth and final phase Panchayat elections polling concludes in AP

  • ఏపీలో నేడు చివరి విడత పంచాయతీ ఎన్నికలు
  • మధ్యాహ్నం 3.30 గంటలకు పోలింగ్ పూర్తి
  • మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి ఏపీలో 78.9 శాతం ఓటింగ్
  • సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్

ఏపీలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 13 జిల్లాల్లోని 161 మండలాల్లోని పంచాయతీల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. 2,743 సర్పంచ్ స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 82.85 శాతం ఓటింగ్ నమోదైంది.

శ్రీకాకుళం జిల్లాలో 83.59 శాతం, విజయనగరం జిల్లాలో 87.09, విశాఖ జిల్లాలో 86.94, తూర్పు గోదావరి జిల్లాలో 80.30, పశ్చిమ గోదావరి జిల్లాలో 83.76, కృష్ణా జిల్లాలో 85.64, గుంటూరు జిల్లాలో 84.92, ప్రకాశం జిల్లాలో 82.04, నెల్లూరు జిల్లాలో 76, చిత్తూరు జిల్లాలో 78.77, కడప జిల్లాలో 85.13, కర్నూలు జిల్లాలో 78.41, అనంతపురం జిల్లాలో 84.49 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు కౌటింగ్ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News