Nirmala Sitharaman: నాకు ఎలాంటి కలలు లేవు, రోల్ మోడళ్లూ లేరు: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman says that she had no dreams and role models
  • బెంగళూరు చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ కార్యక్రమంలో నిర్మలా వ్యాఖ్యలు
  • మీకు కలలు ఉండేవా అన్న ప్రశ్నకు సమాధానం
  • పరిస్థితులను బట్టి నడుచుకునేదాన్నని వెల్లడి
  • విధి తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని వివరణ
బెంగళూరు చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ (బీసీఐసీ) నిర్వహించిన ఓ ఇంటరాక్టివ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా... మీరు యువతిగా ఉన్నప్పుడు మీ రోల్ మోడల్ ఎవరు? మీకు కలలు ఉండేవా? అని ప్రశ్నించగా, నిర్మల ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇది చక్కని ప్రశ్న అని అన్నారు. అయితే, తనకు అప్పట్లో కలలు ఉండేవని కచ్చితంగా చెప్పలేనని అన్నారు. ఆ సమయంలో తన ముందున్న పరిస్థితులను అనుసరించి ముందుకు వెళ్లడమే తప్ప, ప్రత్యేకంగా లక్ష్యాలేమీ లేవని, రోల్ మోడళ్లు లేరని తెలిపారు.

జీవితాన్ని ఇలా నిర్మించుకోవాలన్న ప్రణాళికలు ఉండేవి కావని, తన ముందున్న దారిలో నడిచానని, విధి తనను ఇక్కడికి వరకు తీసుకొచ్చిందని వివరించారు. తనకు తెలిసిందల్లా మెరుగైన పనితీరు కనబర్చడమేనని, అందుకే తనకు ఈ బాధ్యతలు అప్పగించిన వారిని నిరాశపర్చకుండా ముందుకు పోతానని తెలిపారు. భారతదేశ ప్రజలను నిరుత్సాహానికి గురిచేయాలని కోరుకోవడంలేదని నిర్మలా పేర్కొన్నారు.
Nirmala Sitharaman
Dreams
Role Models
BCIC
India

More Telugu News