Mamata Banerjee: ఆయుధాలకు వ్యతిరేకంగా పోరాడాం... ఎలుకలకు భయపడతామా?: మమతా బెనర్జీ

Mamata Banarjee says they will not afraid jail

  • పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి
  • మాతృభాషా దినోత్సవంలో మమత వ్యాఖ్యలు
  • జైలు పేరిట భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడి
  • ప్రాణం ఉన్నంతవరకు భయపడేది లేదన్న మమత

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యల్లో పదును పెంచారు. తమను బెదిరించాలని చూస్తున్నారని పరోక్షంగా బీజేపీ పెద్దలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జైలు, ఇతర పేర్లు చెబుతూ తమను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రాణం ఉన్నంత కాలం ఇలాంటి బెదిరింపులకు భయపడి వెనుకంజ వేసేదిలేదని మమతా స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడారు.

తాము ఓటమి గురించి ఆలోచించడంలేదని, వాళ్లకు (బీజేపీ) తమను ఓడించేంత సత్తా లేదని స్పష్టం చేశారు. 2021లో ఎవరేంటో తెలిపోతుందని, తాను గోల్ కీపర్ గా ఉండి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ప్రత్యక్షంగా చూస్తానని అన్నారు. తన మాతృభాష బంగ్లా అని, తన అమ్మ భాష తనకు పులిలా పోరాడడమే నేర్పిందని తెలిపారు. ఆయుధాలకు వ్యతిరేకంగా పోరాడామని, ఎలుకలకు భయపడబోమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News