Vijayasai Reddy: ఎస్ఈసీ ఏం చేస్తున్నట్లు? గుడ్డిగుర్రం పళ్లుతోముతున్నాడా?: విజయసాయి రెడ్డి

YSRCP MP Vijayasai Questions AP SEC in Twitter
  • ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్న టీడీపీ నేతలు
  • రౌడీయిజం, ప్రలోభాలకు తెగబడుతున్నారు
  • ఎస్ఈసీ చంద్రబాబు సేవలో తరిస్తున్నాడా?
  • ట్విట్టర్ లో విజయసాయి ప్రశ్న
తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగా ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిని అద్దంలో చూపించేశారు ప్రజలు. మున్సిపల్ ఎన్నికల్లో  చేసేది లేక రౌడీయిజం, ప్రలోభాలకు తెగబడుతున్నారు టీడీపీ నేతలు. విజయనగరంలో బహిరంగంగానే కోడ్ ఉల్లంఘిస్తుంటే ఎస్ఈసీ ఏం చేస్తున్నట్లు? గుడ్డిగుర్రం పళ్లుతోముతున్నాడా? చంద్రబాబు సేవలో తరిస్తున్నాడా?" అని ప్రశ్నించారు.

అంతకుముందు మరో ట్వీట్ పెట్టిన ఆయన, "ఎన్నికల ఫలితాలు ఊహించినట్టుగా రాకపోతే ఓటమిని సమీక్షించుకుంటాం అని అంటారు ఎవరైనా. నాలుగో విడత 41.7% ఓట్లు పడ్డాయని సొల్లు మాటలు చెబ్తూనే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసాడు చంద్రబాబు. ఇతను మారడు. తను భ్రమల్లో జీవిస్తూ అందరినీ అదే భ్రాంతిలో ఉంచాలని చూస్తాడు" అని వ్యాఖ్యానించారు.
Vijayasai Reddy
Twitter
SEC
Chandrababu

More Telugu News