Cricket: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ప్రారంభం
- అహ్మదాబాదు శివారులోని మొతేరాలో స్టేడియం
- వర్చువల్ పద్ధతితో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి
- రూ.800 కోట్ల వ్యయంతో నిర్మాణం
- లక్ష మందికి పైగా ప్రేక్షకులు పట్టే సామర్థ్యం
గుజరాత్లోని అహ్మదాబాదు శివారు మొతేరాలో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభమైంది. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులూ పాల్గొన్నారు. రూ.800 కోట్ల వ్యయంతో నిర్మితమైన మొతేరా స్టేడియంలో లక్ష మందికి పైగా ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది.
ప్లడ్ లైట్లకు బదులుగా ఎల్ఈడీ లైట్లను వినియోగించారు. ఈ స్టేడియంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ భారత్- ఇంగ్లాండ్ మధ్య జరగనుంది. కాసేపట్లో ఇరు దేశాల మధ్య ఈ డేనైట్ మూడో టెస్టు మ్యాచు ప్రారంభం కానుంది. గులాబి బంతితో ఈ మ్యాచ్ ఆడనున్నారు.