Sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. 1,030 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- ఈ ఉదయం నిఫ్టీలో టెక్నికల్ సమస్యలు
- ట్రేడింగ్ ను ఆపేసి.. మళ్లీ ప్రారంభించిన వైనం
- పునఃప్రారంభం తర్వాత భారీ లాభాలను ఆర్జించిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం నిఫ్టీలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఉదయం 11.40 సమయంలో ట్రేడింగ్ ను నిలిపేశారు. సాయంత్రం 3.45 గంటకు సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్ ను పునఃప్రారంభించారు. మార్కెట్లు మళ్లీ ప్రారంభమైన తర్వాత సూచీలు దూసుకుపోయాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, పీయూసీ రంగాల అండతో మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,030 పాయింట్లు లాభపడి 50,781కి చేరుకుంది. నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 14,982కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (5.35%), యాక్సిస్ బ్యాంక్ (5.27%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.88%), బజాజ్ ఫైనాన్స్ (3.39%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.01%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.36%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.31%), టీసీఎస్ (-1.24%), ఎన్టీపీసీ (-0.53%), సన్ ఫార్మా (-0.52%).