India: సరిహద్దుల్లో కాల్పులపై ఇండియా, పాకిస్థాన్ ల మధ్య ఒప్పందం

India and Pakistan Agree To Stop All Cross Border Firing Along Line Of Control
  • కాల్పులతో నిరంతరం మారుమోగుతున్న సరిహద్దులు
  • ప్రాణాలు కోల్పోతున్న ఎందరో అమాయకులు
  • సరిహద్దులో శాంతిని నెలకొల్పే దిశగా ఇరు దేశాల చర్చలు
నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడకూడదని భారత్, పాకిస్థాన్ లు ఒక ఒప్పందానికి వచ్చాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో క్రాస్ బోర్డర్ ఫైరింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి ముగింపు పలకాలనే యోచనలో ఇరు దేశాల అత్యున్నత మిలిటరీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలల్లో ఇరు దేశాలు ఈ నిర్ణయానికి వచ్చాయి.

చర్చల అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 'ఇరు దేశాల సంక్షేమం కోసం, శాంతి కోసం ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఎక్కడైతే ఎక్కువగా క్రాస్ ఫైరింగ్ జరుగుతోందో... ఆ సమస్య గురించి అత్యున్నత స్థాయి అధికారులు చర్చించారు. ఇరు దేశాల ఆందోళనలపై చర్చలు జరిపారు. ఎక్కడైతే ఎక్కువ హింస చోటు చేసుకుంటోందో ఆ ప్రాంతాల్లో శాంతిని తీసుకొచ్చే దిశగా చర్చలు జరిగాయి' అని ఇరు దేశాలు సంయుక్తంగా స్టేట్మెంట్ ను విడుదల చేశాయి.

వాస్తవానికి ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 2003లోనే కుదిరింది. అయినప్పటికీ, పాక్ ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, పాక్ నిరంతరం కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పుల వల్ల సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనప్పటికీ.. తాజా ఒప్పందం వల్ల పాక్ లో కొంచమైనా మార్పు వస్తుందని భావిస్తున్నట్టు ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక అధికారి తెలిపారు. పాక్ లో మార్పు వస్తే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని ఆయన చెప్పారు.
India
Pakistan
Cross Border Firing

More Telugu News