India: వృద్ధి బాటన భారత్ పరుగులు: బ్లూమ్ బర్గ్!

Bloomberg High Expectations on Indias Growth

  • తిరోగమనం పోయి వృద్ధి పథం
  • సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వృద్ధి
  • 13 శాతానికి పైగా జీడీపీ వృద్ధి అంచనా

భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ముగిసినట్టేనని, తిరోగమనం పోయి, వృద్ధి పథం ప్రారంభమైందని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించిన సంస్థ, ఇండియాలోని ఎనిమిది కీలక ఆర్థిక సూచీల్లో ఇప్పటికే రెండు సూచీలు పునరుజ్జీవ పథంలోకి వచ్చేశాయని వెల్లడించింది. సర్వీస్ సెక్టార్ తో పాటు మాన్యుఫాక్చరింగ్ రంగంలోనూ వృద్ధి నమోదైందని, ఈ రెండు అత్యంత శక్తిమంతంగా మారాయని వెల్లడించింది.

రానున్న నూతన ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటులోకి తిరిగి రానుందని అభిప్రాయపడిన బ్లూమ్ బర్గ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా భారత్ నిలుస్తుందని అంచనా వేసింది. ఇదిలావుండగా, 2021-22 ఫైనాన్షియల్ సంవత్సరంలో ఇండియా 13.7 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేయవచ్చని ఇప్పటికే మరో రీసెర్చ్ సేవల సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా వేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News