DK Aruna: ఉద్యోగాల విషయంలో కేటీఆర్, చక్రపాణిలలో ఎవరు నిజం చెపుతున్నారో అర్థం కావడం లేదు: డీకే అరుణ

DK Aruna fires on KTR

  • కేసీఆర్ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
  • 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు కేటీఆర్ చెపుతున్నారు
  • ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ తో చర్చకు నేను సిద్ధం

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పట్టభద్రులు సన్నద్ధం కావాలని కోరారు. ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ అవాస్తవాలు చెపుతున్నారని మండిపడ్డారు.

 టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు 32 వేల ఉద్యోగాలను ఇచ్చామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి చెపుతుంటే... 1.32 లక్షల ఉద్యోగాలను ఇచ్చినట్టు కేటీఆర్ చెపుతున్నారని... వీరిద్దరిలో ఎవరు నిజం చెప్పారో అర్థకావడం లేదని అన్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు, కేటీఆర్ ప్రకటించిన లెక్కలకు పొంతన లేకుండా ఉందని అరుణ విమర్శించారు. సింగరేణి సంస్థలో వారసత్వంగా ఇచ్చిన ఉద్యోగాలను కూడా కొత్త ఉద్యోగాల జాబితాలో చేర్చారని మండిపడ్డారు. ఉద్యోగాల అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. తన సవాల్ ను కేటీఆర్ స్వీకరించాలని అన్నారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News