Sonu Sood: ముంబయిలోని తన భవంతి హోదాను నివాసం స్థాయికి మార్చిన సోనూ సూద్

Sonu Sood change his building status from Hotel to Residence

  • వివాదంలో చిక్కుకున్న సోనూ సూద్ భవంతి
  • నివాసాన్ని హోటల్ గా మార్చారని ఆరోపణలు
  • అనుమతుల్లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టారన్న అధికారులు
  • బాంబే హైకోర్టులో సోనూ పిటిషన్
  • పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం

కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా సాగిన సమయంలో తన సేవా కార్యక్రమాలతో విశేషంగా గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు సోనూ సూద్ ఓ వివాదంలో చిక్కుకోవడం తెలిసిందే. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఉన్న తన ఆరు అంతస్తుల భవంతిని అనుమతి లేకుండా హోటల్ గా మార్చారని సోనూ సూద్ పై అధికారులు ఆరోపణలు చేశారు. బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా, అక్రమంగా నివాస భవంతిలో మార్పులు చేసి హోటల్ గా మార్చారని ఆయనపై ప్రధాన ఆరోపణ.

ఈ మేరకు బీఎంసీ సోనూ సూద్ కు నోటీసులు పంపగా, ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సోనూ సూద్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సోనూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే సోనూ సూద్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి తన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

అంతేగాకుండా, జుహూలోని తన భవంతి హోదాను హోటల్ నుంచి నివాసం స్థాయికి మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఈ మేరకు సోనూ సూద్ కు చెందిన ఆర్కిటెక్టులు తగిన పత్రాలను  బీఎంసీకి సమర్పించారు. దీనిపై సోనూ సూద్ ను మీడియా ప్రశ్నించగా, తాను నియమ నిబంధనలను పాటిస్తానని అన్నారు. 

  • Loading...

More Telugu News