Etela Rajender: క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేంద‌ర్!

Telangana Health Minister Etela Rajender receives COVID19 vaccine

  • హుజూరాబాద్‌ ప్రాంతీయ ఆసుప‌త్రికి ఈట‌ల‌
  • అంద‌రూ వేయించుకోవాల‌ని సందేశం
  • తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ లేదని వ్యాఖ్య‌

నేటి నుంచి దేశంలో రెండో ద‌శ క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఈ రోజు ఉద‌యం వ్యాక్సిన్ వేయించుకున్నారు. తెలంగాణ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కూడా హుజూరాబాద్‌ ప్రాంతీయ ఆసుప‌త్రిలో టీకా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకుని అంద‌రూ వేయించుకోవాల‌ని సందేశాన్నిచ్చారు.  

తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ లేదని ఆయ‌న చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సూచ‌న‌ల మేర‌కు నేటి నుంచి ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో 45 సంవత్సరాలు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు  తెలిపారు. అలాగే, కొన్ని ప్రైవేట్ ఆసుప‌త్రుల్లోనూ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని చెప్పారు. వాటిల్లో ఒక్క డోస్‌కి రూ.250 ధ‌ర ఉంటుంద‌ని తెలిపారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు పెట్టుకో‌కూడ‌ద‌ని కోరారు.

  • Loading...

More Telugu News