ISS: చంద్రుడి ముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం... కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం!
- అంతరిక్ష ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెక్ తీసిన దృశ్యం
- అరుదైన దృశ్యమంటున్న పరిశోధకులు
- వైరల్ అవుతున్న చిత్రం
ఇదో అద్భుత దృశ్యం. అనుకోకుండా అంతరిక్ష ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్ ఎంకార్తేకు లభించింది. భూకక్ష్యలో వున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చంద్రుడి ముందుగా వెళుతున్న అరుదైన దృశ్యం ఇతని కెమెరాకు చిక్కింది. ఇది ఓ అరుదైన దృశ్యమని శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు అంటున్నారు.
ఇప్పటికే అంతరిక్షానికి సంబంధించిన క్రేజీ ఇమేజ్ లను క్యాప్చర్ చేసేందుకు రోజులు, వారాలు నిరీక్షిస్తూ ఉండే ఆండ్రూ, తాను క్లిక్ మనిపించిన కొత్త దృశ్యాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. ఇక అదే సమయంలో ఐఎస్ఎస్ కేంద్రం నుంచి వ్యోమగాములు బయటకు వచ్చి స్పేస్ వాక్ చేసే షెడ్యూల్ కూడా ఉండగా, దాన్ని చిత్రీకరించేందుకు తాను ఎదురు చూశానని, అయితే, ఆ దృశ్యాలను తీయలేకపోయానని ఆండ్రూ తెలిపారు. కాగా, ఈ చిత్రం తీసిన సమయంలో అంతరిక్ష కేంద్రం, భూమికి 400 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తూ ఉంది.