Tirupati: తిరుపతి మీదుగా వెళ్లే 18 రైళ్ల రద్దు!

18 Trains via tirupaty Cancelled
  • మరో 7 రైళ్లు పాక్షికంగా రద్దు
  • మరో రెండు రైళ్ల హాల్టింగ్ తొలగింపు
  • 12 వరకూ రద్దు కొనసాగుతుందన్న దక్షిణ మధ్య రైల్వే
తిరుపతి మీదుగా సాగే 18 రైళ్లను పూర్తిగా, మరో 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రైల్వే స్టేషన్ రీమోడలింగ్ పనులు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. తిరుపతి స్టేషన్ మీదుగా వెళ్లే రెండు రైళ్ల హాల్టింగ్ ను తొలగించామని, మరో నాలుగు రైళ్లను దారి మళ్లించామని పేర్కొన్నారు. దక్షిణం వైపు నాన్ ఇంటర్ లాకింగ్, ప్రీ నాన్ ఇంటర్ లాకింగ్, ఎలక్ట్రిఫికేషన్ తదితర పనులు జరగనున్నాయని అన్నారు. 12వ తేదీ వరకూ రైళ్ల రద్దు కొనసాగుతుందని భక్తులు, ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Tirupati
South Central Railway
Trains Cancel

More Telugu News