SpaceX: చివరి దశలో విఫలమైన ప్రయోగం.. పేలిపోయిన ‘స్టార్‌షిప్’ రాకెట్

SpaceX Starship Rocket Prototype Nails Landing Then Blows Up

  • ‘స్టార్‌షిప్‌’ను అభివృద్ధి చేసిన ఎలాన్ మస్క్ సంస్థ
  • గతంలో రెండు ప్రయోగాలు కూడా విఫలం
  • విజయవంతమైందని ప్రకటించిన తర్వాత పేలిపోయిన రాకెట్

ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ అభివృద్ధి చేసిన ‘స్టార్‌షిప్’ రాకెట్ చివరిదశలో విఫలమైంది. ల్యాండింగ్ ప్యాడ్‌పై సాఫీగా దిగిన రాకెట్ ఆ వెంటనే భారీ శబ్దంతో పేలిపోయింది. టెక్సాస్‌లోని బొకా చికాలో బుధవారం ప్రయోగం చేపట్టారు. 10 కిలోమీటర్ల ఎత్తులోకి దూసుకెళ్లిన స్టార్‌షిప్.. మెక్సికో అగాధం దిశగా నిలువుగా దిగుతూ అక్కడ ఏర్పాటు చేసిన ల్యాండింగ్ ప్యాడ్‌పై సాఫీగానే ల్యాండ్ అయింది.

దీంతో ప్రయోగం విజయవంతమైందని  ప్రకటించి ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిలిపివేసి సంబరాలు చేసుకున్నారు. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కొన్ని నిమిషాల తర్వాత భారీ విస్ఫోటనంతో గాల్లోకి లేచిన స్టార్‌షిప్ పేలిపోయింది. కాగా, గతంలో చేపట్టిన రెండు ప్రయోగాలు కూడా ఇలానే విఫలమయ్యాయి.

  • Loading...

More Telugu News