TMC: టీఎంసీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల... నందిగ్రామ్ నుంచి అసెంబ్లీ బరిలో మమతా బెనర్జీ

TMC announced first list of assembly candidates as CM Mamata Banarjee contests from Nandigram
  • పశ్చిమ బెంగాల్ లో మార్చి 27 నుంచి అసెంబ్లీ ఎన్నికలు
  • ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో పోలింగ్
  • 291 మందితో తొలి జాబితా విడుదల చేసిన మమత
  • మార్చి 11న నందిగ్రామ్ నుంచి నామినేషన్!
  • నందిగ్రామ్ లో మమతా వర్సెస్ సువేందు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. టీఎంసీ పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ 291 మందితో తొలి జాబితా విడుదల చేశారు. తాను నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నట్టు మమత ప్రకటించారు. ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి కూడా నందిగ్రామ్ నుంచి పోటీచేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. మమతను ఓడిస్తానని ఆయన చాలెంజ్ చేశారు.

కాగా, తొలి జాబితాలో 50 మంది మహిళలకు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలకు టీఎంసీ టికెట్లు ఇచ్చింది. 80 ఏళ్లకు పైబడిన వారికి మమత టికెట్ నిరాకరించారు. ఉత్తర బెంగాల్ లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. పశ్చిమ బెంగాల్ లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 విడతలుగా పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 11న సీఎం మమతా బెనర్జీ నామినేషన్ వేయనున్నారు.
TMC
Assembly Polls
First List
Mamata Banerjee
Nandigram
West Bengal

More Telugu News