Team India: అహ్మదాబాద్ టెస్టు: ముగిసిన రెండోరోజు ఆట... టీమిండియాకు 89 పరుగుల ఆధిక్యం

Team India gets crucial lead against England in Ahmedabad test

  • భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు
  • అహ్మదాబాద్ లో మ్యాచ్
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 205 ఆలౌట్
  • రెండో రోజు ఆట చివరికి 7 వికెట్లకు 294 రన్స్ చేసిన టీమిండియా
  • సెంచరీతో రాణించిన పంత్

అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. ఆట చివరికి భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. తద్వారా 89 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (60 బ్యాటింగ్), అక్షర్ పటేల్ (11 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

కాగా, ఇవాళ్టి టీమిండియా ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటే హైలైట్. పంత్ వన్డే తరహాలో ఆడి సెంచరీ నమోదు చేశాడు. పంత్ 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్ లతో 101 పరుగులు చేసి ఆండర్సన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

ఇక, రేపు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి ఆధిక్యాన్ని మరింత పెంచుకోవడంపైనే భారత్ దృష్టి సారించనుంది. అయితే ఉదయం పూట పిచ్ పై తేమను దృష్టిలో ఉంచుకుంటే ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ ను ఎదుర్కోవడం ఏమంత సులభం కాదు. పైగా బరిలో ఉన్నది టీమిండియా లోయరార్డర్ ఆటగాళ్లు కావడంతో వారు ఏమేరకు సఫలం అవుతారనేది చూడాలి.

  • Loading...

More Telugu News