India: 365 పరుగులకు భారత్ ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్
- 101 పరుగులతో రాణించిన పంత్
- వాషింగ్టన్ సుందర్ (నాటౌట్) 96 పరుగులు
- తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 205 పరుగులు
- భారత్ కు 160 పరుగుల ఆధిక్యం
భారత్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 365 పరుగుల స్కోర్ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 205 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 160 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
భారత బ్యాట్స్‌మెన్‌లో శుభ్‌మన్ గిల్ 0, రోహిత్ శర్మ 49, పుజారా 17, విరాట్ కోహ్లీ 0, అజింక్యా రహానె 27, రిషభ్ పంత్ 101, రవి చంద్రన్ అశ్విన్ 13, వాషింగ్టన్ సుందర్ (నాటౌట్) 96, అక్షర్ పటేల్ 43, ఇషాంత్ శర్మ 0, సిరాజ్ 0 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్‌కు 4, అండర్సన్ కు 3, జాక్ లీచర్ కు 2 వికెట్లు దక్కాయి.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్సును ప్రారంభించింది. ఇంగ్లండ్ స్కోరు మూడు ఓవర్లకు 6గా ఉంది. క్రాలీ 5, సిబ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.