Gavaskar: అమితాబ్, కిశోర్ కుమార్ ల సరసన ఉన్నానని సంతోషిస్తున్నా: గవాస్కర్

Humble to be in same bracket as Amitabh and Kishor Kumar says Gavaskar

  • సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన గవాస్కర్
  • తొలి సిరీస్ లో సోబర్స్ టీమ్ ను ఎదుర్కోవడం ఒత్తిడికి గురి చేసిందని వ్యాఖ్య
  • 1974 వరకు తనపై ఒత్తిడి లేదన్న సన్నీ

క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసి నేటితో సరిగ్గా 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయనను బీసీసీఐ సత్కరించింది. మరోవైపు ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ ఒక ఐకాన్ గా ఉన్నారని, మరో స్టార్ కిశోర్ కుమార్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉన్నారని, ఆయనను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదని చెప్పారు. నా విషయం గురించి మీరు అడిగితే... వారి సరసన తాను కూడా ఉన్నాననే ఆలోచనే చాలా గొప్పగా ఉంటుందని... అయినా వారితో తనను పోల్చుకోలేనని అన్నారు.

సరిగ్గా 50 ఏళ్ల క్రితం (1971) కరేబియన్ దీవుల్లో తన తొలి టెస్టు ఆడిన విషయంపై ఆయన స్పందిస్తూ... గ్రేటెస్ట్ గ్యారీ సోబర్స్ టీమ్ ను ఎదుర్కోవడం చాలా ఒత్తిడికి గురి చేసిందని చెప్పారు. తొలి సిరీస్ లోనే 774 పరుగులు చేశానని... అయితే, అంతకాకపోయినా కనీసం 400 పరుగులు చేసినా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాడినని అన్నారు. 1974లో దిలీప్ సర్దేశాయ్, అజిత్ వాడేకర్ రిటైర్ అయ్యేంత వరకు తనపై ఒత్తిడి లేదని చెప్పారు. ఆ ఏడాదిలో స్టార్ ప్లేయర్లు రిటైర్ కావడంతో... ఆటను మరింత సీరియస్ గా తీసుకున్నానని తెలిపారు.

షార్ట్ బాల్స్ కు తాను ఎప్పుడూ భయపడలేదని... జెఫ్ థాంప్సన్, మైఖేల్ హోల్డింగ్, మాల్కమ్ మార్షల్ వంటి బౌలర్లు విసిరిన షార్ట్ బాల్స్ తనను భయపెట్టలేదని సన్నీ చెప్పారు. తాను క్లబ్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అవతలి టీమ్ లోని ఫాస్ట్ బౌలర్లు తనపై బౌన్సర్లు సంధించేవారని తెలిపారు. క్లబ్ స్థాయిలో ఎదుర్కొన్న బంతులు అంతర్జాతీయ స్థాయి బౌలర్ల స్థాయిలో లేనప్పటికీ... అలాంటి బంతులతో స్కోర్ చేయడం తనకు ఆ స్థాయి నుంచే అలవాటయిందని చెప్పారు. వేగంగా వచ్చే బంతికి, మన కంటికి సమన్వయం ఎలా ఉండాలో క్లబ్ క్రికెట్ నేర్పించిందని తెలిపారు.

  • Loading...

More Telugu News