KTR: ఈ పెద్ద మనిషికి ఎవరైనా బుద్ధి నేర్పండయ్యా!: కేటీఆర్
- తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం
- టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
- కేంద్రం నిధులతో రాష్ట్రం ఎంజాయ్ చేస్తోందన్న బండి సంజయ్
- రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్ల ఆదాయం వెళ్లిందన్న కేటీఆర్
- కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది రూ.1.40 లక్షల కోట్లేనని వెల్లడి
తెలంగాణలో ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంజాయ్ చేస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించగా, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా ఈ పెద్దమనిషికి బుద్ధి నేర్పండయ్యా! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
గడచిన ఆరేళ్లలో తెలంగాణ ప్రజల ద్వారా కేంద్రానికి రూ.2,72,926 కోట్ల ఆదాయం వెళ్లిందని, కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.1.40,329 కోట్లేనని కేటీఆర్ వెల్లడించారు. దీన్ని బట్టి ఎవరు ఎవరికి నిధులు ఎక్కువ ఇస్తున్నట్టు? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల కంటే, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే ఆదాయమే ఎక్కువని స్పష్టం చేశారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం పట్ల ఓ భారతీయుడిగా తాను గర్విస్తున్నానని ఉద్ఘాటించారు.