Polavaram Project: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తవుతుంది: కేంద్ర ప్రభుత్వం

Polavam project will be finished by April next year
  • పోలవరం పనులపై రాజ్యసభలో కనకమేడల ప్రశ్న
  • లిఖితపూర్వకంగా  సమాధానమిచ్చిన కటారియా
  • ప్రాజెక్టు అథారిటీ సవరించిన షెడ్యూల్ మేరకు ఈ వివరాలను ఇస్తున్నామని వెల్లడి
ఆంధ్రుల జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పుడు పూర్తవుతాయనే సందేహాలు రాష్ట్ర ప్రజలందరిలో ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా... వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పనులు పూర్తవుతాయని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి కటారియా తెలిపారు. ఈమేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సవరించిన షెడ్యూల్ మేరకు ఈ వివరాలను ఇస్తున్నామని ఆయన తెలిపారు.

పనుల వారీగా కటారియా వివరాలను వెల్లడించారు. స్పిల్ వే పనులు మే నాటికి, క్రస్టు గేట్ల పనులు ఏప్రిల్ నాటికి, కాఫర్ డ్యామ్ నిర్మాణం జూన్ కల్లా పూర్తవుతాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కుడి, ఎడమ కాల్వల నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. ఇదే సమయానికి భూ సేకరణ, పునరావాస పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు.
Polavaram Project
Opening Date
BJP
Kanakamedala Ravindra Kumar
Telugudesam

More Telugu News