Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం... ఎల్లుండి పోలింగ్

Municipal election campaign ends in AP

  • నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర
  • మార్చి 10న పోలింగ్
  • 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లకు ఎన్నికలు
  • మార్చి 14న ఓట్ల లెక్కింపు
  • విజయంపై వైసీపీ, టీడీపీ ఎవరికి వారే ధీమా

ఏపీలో నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియడంతో పార్టీలు ప్రచారానికి ముగింపు పలికాయి. ఎల్లుండి (మార్చి 10)న పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 75 మున్సిపాలిటీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా, ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికల నిలిపివేతకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ నిర్వహించడంలేదు.

ఇప్పటికే పంచాయతీల్లో అత్యధికం చేజిక్కించుకున్న వైసీపీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ తమదే విజయం అని గట్టి నమ్మకం వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి ఆమోదం లభిస్తోందని, అందుకు పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని మంత్రులు పేర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు, విపక్ష టీడీపీ సైతం ప్రజాదరణ తమకే ఉందని చెబుతోంది. ప్రజల్లో మార్పు మొదలైందని అంటోంది.

  • Loading...

More Telugu News