Gorantla Butchaiah Chowdary: అసమర్థ జగన్ స్టీల్ ఉద్యోగులతో ఎందుకు మాట్లాడటం లేదు?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

WhyJagan is not speaking to Vizag steel plant employees questions Gorantla Butchaiah Chowdary

  • కేంద్ర ప్రకటనతో ప్లాంట్ ఉద్యోగుల్లో ఆగ్రహం
  • కేంద్రం వద్ద జగన్ సాగిల పడుతున్నారన్న గోరంట్ల
  • ఉత్తరకుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నారని వ్యాఖ్య

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నామని... 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నామని పార్లమెంటు సాక్షిగా నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి కీలక అంశంలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆమె ప్రకటించిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

విశాఖ ఉక్కు కర్మాగారంపై నిన్న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఉక్కు కార్మికులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న అసమర్థ ముఖ్యమంత్రి జగన్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఇలాంటి లాలూచీ రాజకీయాలు దేనికని ప్రశ్నించారు. కేంద్రం దగ్గర సాగిల పడుతూ... ఇక్కడ మాత్రం ఉత్తరకుమారుడి ప్రగల్బాలు పలుకుతున్నాడని దుయ్యబట్టారు. అలాగే, రాష్ట్ర బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News