Pawan Kalyan: క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానికి పవన్ పరామర్శ

Pawan Kalyan went to cancer patients home
  • అభిమాని భార్గవ్ ఇంటికి వెళ్లిన పవన్
  • రూ. 5 లక్షల సాయాన్ని ప్రకటించిన జనసేనాని
  • పార్టీ తరపున వైద్యులను పంపిస్తామని భరోసా
క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని భార్గవ్ ను జనసేనాని పవన్ కల్యాణ్ పరామర్శించారు. కృష్ణా జిల్లా లింగాల గ్రామంలోని అతని నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. భార్గవ్ కు ధైర్యం చెప్పి, వెండి గణపతి విగ్రహాన్ని అందించారు. భార్గవ్ తల్లిదండ్రులతో మాట్లాడి, అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అతనికి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడారు. జనసేన పార్టీ తరపున వైద్యులను పంపిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్ఆర్ఐ దాతల నుంచి విరాళాలు అందేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
Pawan Kalyan
Janasena
Fan
Cancer Patient

More Telugu News