Revanth Reddy: రేవంత్ రెడ్డి విన్నపంపై నిర్ణయాన్ని వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

ACB Court adjourns its decision in Revanth Reddys petition
  • ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొంటున్న రేవంత్
  • నెల రోజుల పాటు విచారణను వాయిదా వేయాలంటూ పిటిషన్
  • ఉద్దేశపూర్వకంగానే విచారణను జాప్యం చేస్తున్నారన్న ఏసీబీ
ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసు విచారణను నెల రోజుల పాటు వాయిదా వేయాలని ఏసీబీ కోర్టులో రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది.

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఏప్రిల్ 8 వరకు విచారణను వాయిదా వేయాలనే రేవంత్ అభ్యర్థనను తిరస్కరించాలని ఈ సందర్బంగా కోర్టును ఏసీబీ కోరింది. ఉద్దేశ పూర్వకంగానే కేసు విచారణను రేవంత్ జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ఇరువైపు వాదనలను విన్న కోర్టు తన నిర్ణయాన్ని ఈనెల 15కు వాయిదా వేసింది.
Revanth Reddy
Congress
Vote for Note Case

More Telugu News