Apple: భారత్ లో ఐఫోన్ 12 అసెంబ్లింగ్ పనులను ప్రారంభించిన యాపిల్
- తమిళనాడులోని ప్లాంట్ లో అసెంబ్లింగ్ పనులు ప్రారంభం
- భారత కస్టమర్ల కోసం ఫోన్ల తయారీ
- భారత్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన యాపిల్
ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ సంస్థ తన ఐ ఫోన్ 12 ఫోన్ల అసెంబ్లింగ్ పనులను ఇండియాలో ప్రారంభించింది. తమిళనాడు ప్లాంటులో ఫోన్లు తయారవుతున్నాయి. యాపిల్ కు కాంట్రాక్టు భాగస్వామి అయిన తైవాన్ కంపెనీ ఫాక్స్ కాన్ అసెంబ్లింగ్ కార్యక్రమాలను చేపట్టింది.
ఇక ఇక్కడ తయారవుతున్న ఫోన్లను భారతీయ కస్టమర్లకే అందించనున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ అయిన ఇండియాపై యాపిల్ సంస్థ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ తార స్థాయికి చేరుకున్న నేపథ్యంలో... చైనా నుంచి తన కార్యకలాపాలను యాపిల్ క్రమంగా ఇతర దేశాలకు తరలిస్తోంది.