Subramanian Swamy: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు
- వ్యాక్సిన్ ను యూరోపియన్ దేశాలు నిలిపివేసినట్టు సీఎన్ఎన్ లో వచ్చింది
- అదే వ్యాక్సిన్ ను మనం కోవిషీల్డ్ గా వాడుతున్నాం
- కేంద్ర ఆరోగ్యశాఖ దీనిపై దృష్టి సారించిందా?
ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టు కేసులు రావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో యూరోప్ లోని పలు దేశాలు ఆ వ్యాక్సిన్ వాడకాన్ని నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను యూరోపియన్ దేశాలు నిలిపివేసినట్టు సీఎన్ఎన్ యూఎస్ఏ ప్రసారం చేసిందని... ఇదే వ్యాక్సిన్ ను ఇండియాలో కోవిషీల్డ్ గా వాడుతున్నామని చెప్పారు. ఈ విషయం గురించి మన కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టి సారించిందా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.